ఆత్మవిశ్వాసం

BY REKHA NMS

పదము పరము పరికిస్తూ
ప్రతిక్షణం పరితపిస్తూ,
ప్రజ్వలించే న్యూనతకు
హవనమందించే ఈ వైనం!
లక్ష్య పధమున రీతిని
మరువని విహానవిహంగాలు,
ఒక్కోటై ఇంకోటై
ఎగసి ఎగసి
ఆకాశం కప్పాలని లేస్తుంటే,

'ఇది నీ సద్దని
నీ సరిహద్దని
ఇది సరి కాదని
ఇది నే కాదని'
తనకు తానైనా ఎవరైనా
ఏమని ఎన్నన్నా,
త్రోవ మరచిన కూర్పును-నేర్పును, నిట్టార్పుతో
ఒదిగి ఒదిగి కూర్చుతుంటే
ఏ సరంగం గమ్యం వైపో
ఏ మృదంగం మరో సంకెలో !
అంటూ
వీచే చిరుగాలులకీ జడుస్తూ
అడుగును,
అడుగడుగునా విదిలిస్తూ
'ఇది నేనని
ఇది నా తరమని'
నేను నేను నమ్మిస్తూ
లోకాలని మోకాలికి రప్పిస్తూ
సెగనని సగాలను సాధిస్తూ ఉన్నానే!
ఇదో రకం కధ నిగముల కథ
కాలం విడిచిన బాణాల
ఆంతరంగిక మంధన
బాహ్య భయాలు, అంతర్రణాలు
ఛేదించిన సాధన కథ!


3 comments

  • ❤️❤️

    Rakee
  • Good work, write more!

    Sums
  • That’a a very moving an inspiraional one.

    Love it ❤️

    N. Keerthi Krishna

Leave a comment