పునర్జన్మ

By Sabbani Laxminarayana

"' పునర్జన్మ ' పుట్టాలి, మరణించాలి , మరణించాలి, మళ్ళీ పుట్టాలి !
కవిత్వానికి కవికి ప్రతిరోజు పునర్జన్మే !
కవి వెలుగాలి, కవి చావాలి, కవి పుట్టాలి మళ్ళీ మళ్ళీ సూర్యుడిలా
సర్కస్ ఫీట్లు వేయడానికి కవి గారడివాడు, భఫూన్ కాదు
పేరు కీర్తి కోసం నానా గడ్డి తినడానికి అడ్డమైన గాడిద కాదు పాపులరిటీకి రెండు నిర్వచనాలు ఉండవటా అయితే శ్రీనాథుడైనా, శ్రీ శ్రీ అయినా కావాలి కవి లేకుంటే వాడు చీప్ పాపులరిటీ లోనే బతికినట్టు మెదళ్ళలోనే విష వృక్షాలు పెరిగిన చోట విష వృక్షాలే, వామన వృక్షాలే మహా వృక్షాలు అని చెప్పబడే చోట గుబాలింపుల గులాబీలా కాదు నువ్వు కూడా విష వృక్షంలాగే భ్రమిస్తూ సాగిపోమ్మనడం విజ్ఞత కాదు ఒక్కసారి పుట్టిన కవి, వెయ్యి సార్లు మరణించి వెయ్యి సార్లు పునర్జన్మించాలి ! . ఒకడు దాత కావచ్చు, ఒకడు భూనేత కావచ్చు
ఒకడు స్టార్ కావచ్చు, క్రికెట్ స్టార్ కావచ్చు.
కాని దాత కన్న, భూనేత కన్న స్టార్ కన్న
ఎవర్ గ్రీన్ స్టార్ కవి!
కవిది విశాల విశ్వం, విశాల సామ్రాజ్యం
కవి తన సామ్రాజ్యానికి తను చక్రవర్తి .
పేరునో, కీర్తినో, డబ్బునో,హోదానో, అంతస్తునో
ఎవరి దగ్గరో అడుక్కునే పరాన్నబుక్కు కాదు
సాలెపురుగుకున్న, గిజిగాడికున్న నేర్పు , పనితనం
పట్టు పురుగుకున్న త్యాగం
చీమకు, తెనేటీగకున్న తెలివి
రంగురంగుల సీతాకోక చిలుక జీవిత రహస్యాలు తెలిసుండాలి కవికి
కవిని చంపచ్చు, కాని కవి భావాన్నెవడు చంపుతాడు
పేరుతో, కులంతో, గోత్రంతో, డబ్బుతో, హోదాతో, అంతస్తుతో
గొప్పవాడనిపించుకోవడం కన్నా
కవి తన కవితలతోనే గొప్పవాడనిపించుకోవటం గొప్ప !
మనిషిగా కవి చచ్చి పోతాడు
కవిగా కలకాలం బతుకుతాడు వాడు కవి అయితే
కవిత్వం ఒక పునర్జన్మ కవికి తరతరాలకి !"


1 comment

  • Excellent poem on poetry.

    Sabbani Laxminarayana

Leave a comment