ప్రశ్నా కృష్ణ బిలాలు

BY S RAMANUJACHARI KANCHI 

నీ ఉనికిల విశ్వానికి ప్రశ్నలు అనే కృష్ణ బిలాలని ఇస్తాను
అవి నీ సమాధానలతో వచ్చే సమాజ మార్పుతో కడుపు నింపుకోవాలనుకుంటాయి
నీ సమాజాన్ని తమలో సహగిమించమని వెంటపడతాయి
వాటి ఆకలికి అక్షర బలిదానాలు చేస్తావో సమాజ ప్రక్షాళన మొదలెడతావో నీ ఇష్టం
నా ప్రశ్నా కృష్ణ బిలాలు,
ఎవరిని కంటోందో తెలియక కనే అమ్మకు పశువును కందన్న నిందెందుకు అంటాయి
సగం చచ్చిన సమజాన్ని బ్రతికించకుండా భావజాల తర్పణాలు ఎందుకంటాయి
స్వేచ్ఛా విహంగాల కుత్తుకలు కోసి దేశానికి అద్దిన రక్తం కెంపు సొగసు ఎందుకు అవుతుందంటాయి
నీ ఇజాల బొక్కల మధ్య నిజాల గుజ్జు ఎంతుందో తెలియజేయమంటాయి
కుడి ఎడమల సంగ్రామాలకు, మత చాంధస వాదనలకు సామాన్యుడి కడుపు నిండుతుందా అంటాయి
ఏమిస్తావు వాటికి సమాధానం?
నీ లెనిన్ ఈ పరాన్న జీవులని సహజీవులుగా మార్చగలడా అంటాయి
ఆ హెడ్గేవారు హెచ్చి రెచ్చిన మత పిచ్చిని తగ్గించగలడా అంటాయి
స్వజన పీడన స్వత్రంత్ర దేశంలో పరతంత్రానికంటా నికృష్టం కాదా అంటాయి
సమాధానం తెలియకో, తెలిసినా దాచో, చెప్పే సోది వ్యాసంగాలతో పని ఏమిటి అంటాయి
ఎమిస్తావు వాటికి సమాధానం?
నీ ఉనికిల విశ్వాన్ని ప్రశ్నిస్తున్నాయి నా ప్రశ్నా కృష్ణ బిలాలు!
నీ ఉనికిల విశ్వాన్ని ప్రశ్నిస్తున్నాయి నా ప్రశ్నా కృష్ణ బిలాలు!


Leave a comment